'మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'
W.G: మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆచంట MLA పితాని సత్యనారాయణ అన్నారు. ఆచంట కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ వేడుకల్లో మహిళలు, వివిధశాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.