VIDEO: భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలం

MLG: భారీ వర్షాలతో రాష్ట్రంలోనే చిన్న జిల్లా అయిన ములుగు అతలాకుతలం అవుతోంది. జిల్లాలోని 10 మండలాల్లో భారీ వర్షంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం మంగపేటలో ఇళ్లలోకి నీరు చేరి, రోడ్లపై వరద పోటెత్తింది. దొడ్లవద్ద జంపన్నవాగు పొంగి 4గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. గోదావరికి వరద పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు గజగజ వణుకుతున్నారు.