'విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలి'
MNCL: హాజీపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, పారిశుద్ధ్య నిర్వహణ, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు.