పాంబండ రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
VKB: కుల్కచర్ల మండలంలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివుడికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి, అష్టోత్తర పఠనం అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోగా, ఆలయ కమిటీ వారు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.