బస్సు కోసం.. విద్యార్థుల ధర్నా..!
GDWL: రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో కనీస బస్సు సౌకర్యం కూడా లేదని రాజోలి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పచ్చర్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం విద్యార్థులతో కలిసి ఆయన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన పాలకులు, అధికారం చేపట్టాక కనీస రోడ్డు సౌకర్యం కూడా కల్పించకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.