రెండు తలలతో గొర్రె పిల్ల జననం
JN: నర్మెట్ట మండల కేంద్రంలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. వెల్దండకు చెందిన గొర్రెల కాపరి శ్రీపతి కుమార్ మందలోని ఓ గొర్రె మంగళవారం 2 తలల గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. తల తప్ప ఆ గొర్రె పిల్ల ఆకారం మిగిలిన గొర్రెల మాదిరిగానే ఉందని రైతు తెలిపాడు. ఆ గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.