జనగామలో టీజీవీపీ వినూత్న నిరసన

జనగామలో టీజీవీపీ వినూత్న నిరసన

జనగామ పట్టణంలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం చెవిలో పువ్వులతో వినూత్న నిరసన చేపట్టారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.