ఉచిత టెట్ శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

ఉచిత టెట్ శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

ADB: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ADB ఉర్దూ భవన్లో ఏర్పాటు ఉచిత టెట్ శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్లాలని, విద్యార్థుల సౌకర్యార్థం లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.