'అక్కా ఫ్రీ బస్సులో రావొద్దు.. సూపర్ లగ్జరీలో రా'

'అక్కా ఫ్రీ బస్సులో రావొద్దు.. సూపర్ లగ్జరీలో రా'

NLG: జిల్లా వ్యాప్తంగా 2, 3 విడత ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. పట్టణాల్లో ఉన్న ఓటర్లను స్వగ్రామానికి రప్పించేందుకు వారే ఖర్చు భరిస్తున్నారు. ఫోన్‌ చేసి, 'అక్కా ఫ్రీ బస్సులో రావొద్దు.. ఇబ్బంది పడుతావు. సూపర్ లగ్జరీ బస్సులో రా'.. అంటూ అభ్యర్థులు ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు.