VIDEO: ప్రతి పనిని పర్యవేక్షిస్తాం: కార్పోరేటర్
RR: హయత్ నగర్ డివిజన్ సుభద్ర కాలనీలో జరుగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కార్పోరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. పనితీరును సంబంధించిన అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యం అని, ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామన్నారు.