IPL మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందాపై పోలీసుల నిఘా
HYD: ఉప్పల్ వేదికగా ఇవాళ IPL మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. SRH VS CSK మ్యాచ్ కావడంతో భారీ క్రేజ్ నెలకొంది. ఈ క్రమంలో బ్లాక్ టికెట్ దందాను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. స్టేడియం పరిసరాల్లో మఫ్టీలో నిఘా పెంచారు. ఎవరైనా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటికి క్రికెట్ అభిమానులు మోస పోవద్దని సూచిస్తున్నారు.