VIDEO: వృధాగా పోతున్న తాగునీరు
AKP: గొలుగొండ మండలం జోగుంపేట గ్రామ శివారు ప్రాంతంలో తాగునీరు వృధాగా పోతోంది. ఇక్కడ మంచినీటి సరఫరా చేసే పైపు లైన్ మరమ్మతులకు గురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా పైపు లైన్ మరమ్మతులకు గురై నీరు వృధాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు