నేడు ఆండ్ర PSలో మోటర్ సైకిళ్ళు వేలం

VZM: మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 6 మోటార్ సైకిళ్లను సోమవారం స్టేషన్ ప్రాంగణంలో వేలం వేస్తున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ సీతారాం తెలిపారు. ఈ మేరకు ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వ్యక్తులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వాహనాలు వేలం వేయడం జరుగుతుందన్నారు.