స్టేడియం ఇలా.. ఆడేది ఎలా

స్టేడియం ఇలా.. ఆడేది ఎలా

SKLM: జిల్లా కేంద్రంలో గల కోడి రామ్మూర్తి స్టేడియంలో వరద నీరు పేరుకుపోవడంతో క్రీడాకారులు ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతిరోజు వందలాది మంది ఈ ప్రాంగణానికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. వాలీబాల్, బ్యాట్మింటన్, ఫుట్‌బాల్‌తో పాటు వ్యాయామాలు చేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ క్రీడా ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. ఆటలాడే సమయంలో జారి పడిపోయే ప్రమాదం ఉందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.