బాలిక హత్య కేసు.. నిందితుడు పదో తరగతి విద్యార్థి?

TG: కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక దారుణ హత్య వెనుక మిస్టరీ వీడింది. బాలికను పదో తరగతి విద్యార్థి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలున్నాయి.