BJP రాష్ట్ర అధ్యక్షుడికి కుమ్మర్ల వినతి

BJP రాష్ట్ర అధ్యక్షుడికి కుమ్మర్ల వినతి

W.G: BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎం మాధవ్ను జిల్లా కుమ్మర్ల శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురుజుకోట రాకేశ్ బాబు సోమవారం కలిశారు. విజయవాడలో జరిగిన సాంస్కృతిక వైభవం కార్యక్రమంలో పాల్గొని, శాలివాహన కుమ్మర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. శ్రీ శాలివాహన చక్రవర్తి, కవయిత్రి మొల్ల మాంబ వైభవం గురించి చర్చిస్తూనే, తమ సామాజిక వర్గ సమస్యలను పరిష్కరించాలని కోరారు.