కొత్తమ్మ తల్లి ధర్మ హుండీ ఆదాయం ఎంతంటే..?
SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ధర్మ హుండీ ఆదాయం రూ.6.91లక్షలు లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాచర్ల రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ ఛైర్మన్ కోరాడ గోవిందరావు, పాలకమండలి, సోంపేట ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, పోలీస్ సిబ్బంది భక్తులు ఆధ్వర్యంలో లెక్కించినట్లు పేర్కొన్నారు.