VIDEO: మద్నూర్‌లో వందేళ్ల నాటి రామాలయం..!
KMR: మద్నూర్ మండల కేంద్రంలోని మల్లేశ్వర మందిరం ముందున్న రామాలయం వందేళ్ల నాటిదని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రాంతంలో వెలిసిన మొట్టమొదటి రామాలయం ఇదేనని, ఇక్కడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు శతాబ్ద కాలం నాటి చరిత్ర ఉందని పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.