ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి: సీఐ

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి: సీఐ

VKB: విద్యార్థులు, యువత ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. యువత ఆర్థికంగా నష్టపోయి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వారిలో 25 ఏళ్లలోపు వారే అధికమని తెలిపారు. ఉన్నత లక్ష్యాలను సాధించి జీవితంలో స్థిరపడాలని యువతకు సూచించారు.