మాదనంద స్వామితో జగ్గారెడ్డి
సంగారెడ్డి రాంనగర్ రామ మందిరంలోని ఆశ్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామితో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ చర్చించారు. ఆశ్రమంలో చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షిస్తూ, అవసరమైన సూచనలు చేశారు. ఆశ్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చేలా అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్తన్న, నారాయణ పాల్గొన్నారు.