గ్రామాలు, పట్టణాలే స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులు
కోనసీమ: ఆలమూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం తమ నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులని ఆయన వివరించారు.