అక్రమాలకు పాల్పడుతున్న ఈవో
SKLM: జలుమూరు మండలం శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయ EO నిత్య అన్నదానం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రధానర్చకులు నాయుడుగారి రాజశేఖర్ మంగళవారం తెలిపారు. ఇంతవరకు నిత్యాన్నదాన పథకము కూడా ఈ ఆలయానికి లేదన్నారు. ఐనప్పటికి చట్టవిరుద్ధంగా అన్నదానానికి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. భక్తులు అన్నదానానికి ఎటువంటి విరాళాలు ఇవ్వవద్దని తెలిపారు.