CMR చెక్కుల పంపిణీ చేసిన నేతలు

WGL: చెన్నారావుపేట మండల అక్కల్ చెడ గ్రామంలో ఆదివారం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. అనారోగ్యంతో చికిత్స పొందిన బాధవత్ రవి కుమార్ కుటుంబానికి రూ.16 వేల చెక్కును స్థానిక నేతలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ తూటి పావని రమేష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పులిశేరు రాజేందర్, స్థానిక నాయకులున్నారు.