కేసముద్రంలో ‘మేడే' కరపత్రాల ఆవిష్కరణ

కేసముద్రంలో ‘మేడే' కరపత్రాల ఆవిష్కరణ

MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఐసీటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ.. మేడే వేడుకలను గ్రామగ్రామాన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.