'అభ్యర్థుల ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి'

'అభ్యర్థుల ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి'

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులు ప్రచారంలో భాగంగా చేసే వ్యయం వివరాల నమోదుపై శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సహాయ వ్యయ పరిశీలకులకు, AEOలకు శిక్షణ ఇచ్చారు.