పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ

VZM: డెంకాడ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలను ఆయన సమీక్షించారు. స్థానికంగా జరుగుతున్న చట్టవ్యవస్థ పరిస్థితులను ఎస్పీ వివరంగా తెలుసుకున్నారు. రికార్డులు, ఫిర్యాదుల పరిష్కార విధానం, నేరస్తులపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.