VIDEO: యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.4.80 కోట్లు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల కానుక రూపంలో వచ్చిన హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. అందులో నగదు రూ.4,80,77,919, మిశ్రమ బంగారం 177 గ్రాములు, మిశ్రమ వెండి 9 కేజీల 700 గ్రాములు స్వామివారి ఖజానాకు ఆదాయం సమకూరిందని ఆలయ EO వెంకట్రావు వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, భద్రత సిబ్బంది పాల్గొన్నారు.