గుడుంబా స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు
BHPL: చిట్యాల మండలం పాశిగడ్డ తండాలో మంగళవారం SI సతీష్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాల పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని.. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. అనంతరం SI సతీష్ మాట్లాడుతూ.. అక్రమంగా గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.