'ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే'

NLR: గూడూరు నియోజవర్గ ప్రజలకు గూడూరు శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనమందరం పూజించే దేవుళ్ళు విజయం సాధించిన రోజే దశమి అని, కష్టాల కడలి నుంచి విజయానికి నాంది పలికే దశమే విజయదశమి అని అన్నారు. ప్రజలందరూ తమ జీవితంలో విజయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.