రూ.7270 కోట్లతో విమానాల కొనుగోలుకు ఇండిగో
దేశీ విమానయాన కంపెనీ ఇండిగో.. విమానాల కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అనుబంధ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ IFFC PVT.LTDకు రూ. 7,270 కోట్లు అందించనున్నట్లు సమాచారం. ఒకేసారి లేదా దశలవారీగా వీటి జారీని చేపట్టనున్నట్లు ఇండిగో తెలిపింది. ఇప్పటికే 411 విమానాలను కలిగి ఉంది. వీటిలో 365 విమానాలు నిర్వహణలో ఉన్నట్లు వెల్లడించింది.