VIDEO: రహదారులపై ధాన్యం ఆరబోత.. వాహనదారులకు ఇబ్బందులు
KNR: రహదారులపై ధాన్యం అరపెట్టడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారులు ధాన్యపు కల్లాలుగా మారుతున్నాయి. రైతులు మొక్కజొన్న కంకులు, వరి ధాన్యం దొట్లపై ఆరబోయడం వల్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి వేళల్లో ఇవి సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.