27 లోగా టెండర్లు దాఖలు చేయాలి: DMHO

KMM: డెంగ్యూ ఏలిసా వాషర్, రీడర్ మిషన్ ల సరఫరా చేయడానికి టెండర్లు దాఖలు చేయాలని DMHO డాక్టర్ కళావతి బాయి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీల్డ్ కవర్ టెండర్లను ఆఫ్ లైన్ పద్ధతిన ఆగస్టు 27 మ.3 గంటల్లోగా జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. ఆగస్టు 28 మ.2 గంటలకు టెండర్లను ఫైనల్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.