ఆడ బిడ్డలను కూటమి మోసం చేసింది: నూరీఫాతిమా

ఆడ బిడ్డలను కూటమి మోసం చేసింది: నూరీఫాతిమా

GNTR: కూటమి ప్రభుత్వం 'ఆడబిడ్డ నిధి' పేరుతో అమలు కాని హామీ ఇచ్చి మోసం చేసిందని బుధవారం వైసీపీ గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్ నూరీఫాతిమా ధ్వజమెత్తారు. 'ఆడబిడ్డ నిధి' అమలు చేయాలంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని ఆమె దుయ్యబట్టారు. పార్టీ నాయకులు పథకాలపై స్పష్టత లేకుండా భిన్న స్వరాలు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.