కూలీలకు అవగాహన కల్పించిన పోలీసులు

ప్రకాశం: మార్కాపురం పట్టణం నుంచి కూలీ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తున్న మహిళలకు పోలీసులు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కూలీలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. కాగా, మిర్చి కోతలకు వెళ్లి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నికరంపల్లి వద్ద వాహనం బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.