బీసీ షీట్ హోల్డర్ల ఇళ్లను సందర్శించిన డీఎస్పీ

ప్రకాశం: హనుమంతుడుపాడు ఎస్సై మాధవరావుతో కలిసి డీఎస్పీ కనిగిరి పట్టణంలోని బీసీ షీట్ హోల్డర్ల ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ వారి ప్రస్తుత కార్యకలాపాలు, జీవనోపాధి గురించి, వారి పెండింగ్ కేసుల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఎటువంటి నేరాలకు పాల్పడవద్దని వారికి హెచ్చరికలు జారీ చేశారు.