'ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ వినియోగించాలి'
SKLM: పట్టణంలో హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ పోలీసుల సిఐ రామారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న దూరం ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వినియోగించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చాక్లెట్లు పంపిణీ చేశారు.