ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి

ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు రావడంతో లబ్ధిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.