ప్రతి దరఖాస్తును పరిష్కరించాలి: కలెక్టర్

ప్రతి దరఖాస్తును పరిష్కరించాలి: కలెక్టర్

MBNR: రైతుసదస్సులో భూ సమస్యలపై రైతుల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మండల పరిధిలోని నందిపేటలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రెవెన్యూ చట్టంపై రైతులకూ అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.