'రాజకీయ విరాళాల పేరుతో బోగస్ క్లెయిమ్‌లు'

'రాజకీయ విరాళాల పేరుతో బోగస్ క్లెయిమ్‌లు'

గుర్తింపులేని రాజకీయ పార్టీలు, ఛారిటీలకు విరాళాలు ఇచ్చామంటూ భారీగా నకిలీ క్లెయిమ్‌లు నమోదైనట్లు సీబీడీటీ గుర్తించింది. దీనిపై ఆదాయపు పన్ను విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పలువురు పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం సందేశాలు పంపింది. తప్పుడు క్లెయిమ్‌లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చింది.