బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై దాడులు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై దాడులు

VZM: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రాజా సినిమహల్ సమీపంలో బహిరంగ మద్యం సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అల్లర్లు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.