నేడు యూనివర్సిటీకి చాగంటి రాక..!
గుంటూరులో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయానికి శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రచారకర్త చాగంటి కోటేశ్వరరావు రానున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత నిర్మాణం, నైతిక విలువలు అనే అంశంపై విద్యార్థులకు పలు సూచనలు చేస్తారన్నారు. ఈ విషయాన్ని గమనించి విద్యార్థులంతా పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేశారు.