ఇటుకల పహాడ్ వద్ద పెద్దపులి సంచారం

ఇటుకల పహాడ్ వద్ద పెద్దపులి సంచారం

ASF: సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్‌లో ఆదివారం పులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతం పులులకు ఆవాస కేంద్రంగా మారిందని స్థానికులు తెలిపారు. సిరిపుర్ టి రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు, గ్రామాల్లో పులి కదలికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు మాకిడి ఫారెస్ట్ సెక్షన్ అధికారి వల్క మోహన్ రావు తెలిపారు.