4 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా విజయం
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. స్వల్ప తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి పి. స్రవంతి అనే అభ్యర్థి కేవలం 4 ఓట్ల తేడాతో గెలుపొందారు.