రామేశ్వర ఆలయంలో పాడ్యమి పూజలు
ATP: రాప్తాడులోని రామేశ్వర దేవాలయంలో శుక్రవారం పాడ్యమి పూజలు భక్తిశ్రద్ధలతో శివదీక్ష స్వాములు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శివునికి నాగభరణ అలంకరణ చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించని వారు పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించడం ద్వారా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించినంత పుణ్యం పొందుతారని అర్చకులు తెలిపారు.