వినుకొండలో మహిళ మృతిపై విచారణ

వినుకొండలో మహిళ మృతిపై విచారణ

PLD: వినుకొండ పట్టణం, కళ్యాణ్ పురి కాలనీలో ఆలపాటి పుష్పా(38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై వినుకొండ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ శోభన్‌బాబు, మృతికి గల కారణాలపై ఆరా తీశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.