ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

NZB: శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద వస్తోంది. దీంతో అధికారులు శుక్రవారం సాయంత్రం 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 59,454 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు నీటి విడుదలను నిలిపేశారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.