నేర్మట-బంగారిగడ్డ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి
NLG: చండూరు మండలంలోని నేర్మట నుంచి బంగారిగడ్డ రోడ్డును బీటి రోడ్డుగా మార్చాలని, ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం నేర్మట నుంచి బంగారిగడ్డకు పోయే మట్టిరోడును ఆయన పరిశీలించారు. ఈ రోడ్డు వెంట వెళ్ళాలంటే ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.