'వర్ష సూచన దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలి'
ఖమ్మం జిల్లాలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వరి కోతలను నిలిపివేయాలని మధిర అగ్రి అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించి, టార్పాలిన్‌తో కప్పుకోవాలని ఏడీఏ విజయ చంద్ర సూచించారు.