VIDEO: ట్రిపుల్ ఐటీలో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన
KDP: వేంపల్లి (మం) ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో మంగళవారం విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల మధ్య సమస్యను పెద్దది చేసి, వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అధికారులను, పోలీసులను నిలదీశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. డైరెక్టర్, పోలీసులు చర్చించుకుందామని చెప్పినా ఫలితం లేకపోయింది.