VIDEO: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
SDPT: హైదరాబాద్-సిద్దిపేట రాజీవ్ రహదారిపై గౌరారం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గౌరారం వద్దకు చేరుకోగానే, ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు నియంత్రణ కోల్పోయి లారీ వెనుక భాగంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.